రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది...

కేంద్రంలోని నరేంద్రమోడీ గారి ప్రభుత్వం దేశం లో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలకు కేటాయించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేక రకాల ఉద్యమాల తర్వాత అనేక రకాల నిర్బంధంలో తర్వాత అనేక రకాల కేసులు తర్వాత నేడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది..






భారతీయ జనతా యువమోర్చా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటిసారి నేను చెప్పిన మాట ఈ ఒక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు అయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అనేకసార్లు ఈ రిజర్వేషన్ అమలు కొరకు ఉద్యమాలు చేయడం జరిగింది...
నేడు ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి రిజర్వేషన్ల అమలు చేస్తామని జివో జారీ చేయడాన్ని భారతీయ జనతా యువమోర్చా స్వాగతిస్తుంది అభినందిస్తూ ఉంది ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఉద్యమాలకు ప్రజల యొక్క ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా ఏ రాష్ట్రం ప్రభుత్వం కూడా మనుగడ లేదు అని చెప్పడానికి నిదర్శనం ఈ అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ అమలు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పవలసిన సమయం ఆసన్నమైందని తెలియజేస్తున్నాను..